ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
- ఉండవల్లి నివాసంలో బూత్ లెవల్ అధికారికి తన వివరాల సమర్పణ
- ప్రతి పౌరుడూ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
- ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్, ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తన ఓటు వివరాలను బూత్ స్థాయి అధికారికి (బీఎల్ఓ) అందజేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీఎల్ఓకు ఆయన అవసరమైన పత్రాలను, సమాచారాన్ని సమర్పించారు.
భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన "ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026" కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజలందరూ సహకరించాలని, తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా లోకేశ్ స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారులు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించడంతో పాటు, అర్హులైన నూతన ఓటర్ల నమోదును చేపడుతున్నారు. అభ్యంతరాలు పరిశీలన అనంతరం జులై 21న ముసాయిదా జాబితాను, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.